logo

యుకే పార్లమెంటులో ప్రవాసాంధ్రుల బిజినెస్ మీట్

యునెటైడ్ కింగ్‌డమ్ (యుకే) పార్లమెంట్ హౌస్‌లో ప్రవాసాంధ్రులకు ప్రత్యేకంగా ‘బిజినెస్ నెట్‌వర్కింగ్ మీట్’ నిర్వహించ తలపెట్టారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న యునెటైడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ (యుకేటీఏ), యుకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుకేఐబీసీ) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. యుకే పార్లమెంట్ హౌస్‌లో ప్రవాసాంద్రులకు ఉద్దేశించి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఇదే ప్రథమమని నిర్వాహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

నిర్ణీత తేదీన సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య జరగనున్న ఈ వ్యాపార జాలాకార వ్యవస్థ సమ్మేళనానికి ఔత్సాహిక తెలుగువారు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు మాట్లాడే వ్యాపారవేత్తల్లో నైపుణ్యం పెంపొందింపజేసేందుకు, దేశవ్యాప్తంగా వ్యాపార అవకాశాలను వివరించేందుకు ఈ సభ ఏర్పాటు చేసినట్లు తెలియజేసింది.

అలాగే వ్యాపార న్యాయ సలహాలు అందజేసేందుకు, పారిశ్రామిక వేత్తల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని కలిగించేందుకు ఈ సదస్సు తోడ్పతుడుతందని వివరించారు. పారిశ్రామిక, వృత్తివిద్యా రంగాల్లో 80 మంది నిపుణులు ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు. లార్డ్ బిలిమోర (యుకేఐబీసీ అధ్యక్షులు), వీరేంద్రశర్మ, అరవింద్ కుమార్ (ఐఏఎస్), అలోక్ టాండన్ (ఐఏఎస్), బందన ప్రెయసి (ఐఏఎస్), ప్రవీణ్ కుమార్.కె (ఐఏఎస్), అనూప్ జాన్ (ఐపీఎస్), మాధవన్ (ఐపీఎస్), అంజుల్ నేగి, పోచం శ్రీనివాసరెడ్డి, మధుయాష్కీ గౌడ్, సీ.రాజశేఖర్ తదితర ప్రముఖులు, మేథావులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు.